వినాయక చవతి మతాలకు సంబంధించిన అంశం కాదు : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి

BJP state vice president Vishnuvardhan Reddy comments : వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2020-08-17 07:23 GMT
Vishnuvardhan Reddy

BJP state vice president Vishnuvardhan Reddy comments : వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు సామూహికంగా జరుపుకునే చిన్నచిన్న మండపాల విషయంలో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. వినాయక చవితి సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగ అని ఆయన చెప్పారు. పండుగలను, ప్రజలను ప్రభుత్వం మత, ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదన్నారు. వినాయక చవతి మతాలకు సంబంధించిన అంశం కాదని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని మతం కోణంలో చూస్తున్నట్లుందన్నారు.

ఈ విషయంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును అధికారులు హరిస్తే ఎలా ? అని ప్రశ్నించారు. ఇది మంచిది కాదన్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడి ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఇతర అధికారులు ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. రంజాన్ మాసంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభిప్రాయాలు ఇప్పుడు తీసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నానని తెలిపారు. ఇటువంటివి ప్రజలవిశ్వాసాలను,బాధ్యతను సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాన్న విషయాన్ని గుర్తు చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం హిందుమత పెద్దలు, స్వామీజీ లు, మఠాధిపతులతో చర్చించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.



Tags:    

Similar News