Krishna Sagar Rao: దేశం మొత్తం ఎన్నికల ఖర్చు కేసీఆర్‌కు ఎలా సాధ్యం..
Krishna Sagar Rao: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శలు గుప్పించారు.
Krishna Sagar Rao: దేశం మొత్తం ఎన్నికల ఖర్చు కేసీఆర్‌కు ఎలా సాధ్యం..
Krishna Sagar Rao: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రత్యర్థి కూటమికి కేసీఆర్ ఛైర్మన్‌గా ఆశిస్తున్నట్లు.. ఓ ప్రముఖ జర్నలిస్ట్ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నట్లు వివరించారు. అయితే రెండు టర్మ్‌లు సీఎంగా ఉన్న వ్యక్తి 28 రాష్ట్రాలకు ఎన్నికల ఫండ్ ఎలా ఇవ్వగలడు అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు కృష్ణసాగర్ రావు. దేశం మొత్తం ఎన్నికల ఖర్చు కేసీఆర్‌కు ఎలా సాధ్యం అంటూ నిలదీశారు. ఎంత అవినీతికి పాల్పడితే ఇంతగా సంపాదిస్తారోనని అన్నారు. ఇది విపరీత పోకడగా బీజేపీ భావిస్తుందన్నారు కృష్ణసాగర్ రావు.