Uttam Kumar Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
Uttam Kumar Reddy: రెడ్డి పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
Uttam Kumar Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
Uttam Kumar Reddy: ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కేంద్రంలో బీజేపీని ఓడించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదని ఆరోపించారు. 2022లో రైతుల ఆదాయం రెట్టింపుచేస్తామని హామీ ఇచ్చినా..ఉన్న ఆదాయాన్ని తగ్గించారని ఎద్దేవా చేశారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధి జైవీర్ రెడ్డికి దేశంలోనే అత్యధిక మెజారిటీ తీసుకు వస్తామన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు తెలిపిన సీపిఐ, సీపియం కమ్యూనిస్టు పార్టీల సేవలను మర్చిపోనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.