Bandi Sanjay Wrote Letter to KCR: సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్...

Bandi Sanjay Wrote Letter to KCR: కరోనా వైరస్ ను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను, వచ్చిన ఫండ్స్ ను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2020-07-21 12:48 GMT
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫైల్ ఫోటో

Bandi Sanjay Wrote Letter to KCR: కరోనా వైరస్ ను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను, వచ్చిన ఫండ్స్ ను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణలో కరోనా పరిస్థితిపై, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. అన్నిపార్టీలతో మాట్లాడిన విధంగానే ప్రతిపక్షాలతో కూడా ప్రభుత్వం కరోనా నివారణపై బేషజాలను పక్కనబెట్టి మాట్లాడాలన్నారు. ఆయనతో సంభాషణలో భాగంగా 100 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారని, ఈ విషయం మీడియాలో వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. కరోనా నియంత్రణకు ఇప్పటివరకు వినియోగించిన నిధుల వివరాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన నిధులు, వ్యయం ఇతర వివరాలు తెలియాలన్నారు. కరోనాను నివారించేందుకు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇలా చేయడం ద్వంద వైఖరి కాదా..? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో చూస్తే కరోనా అంశంలో ప్రజల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొని ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రాణాలు రక్షించడం తక్షణ అవసరం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై సిబ్బందే ధర్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కరోనా కేసుల విశయాలపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ పనితీరును అధికారుల నిర్లక్ష్యాన్ని, ఆస్సత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. న్యాయస్థానం ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్నికాపాడాలని ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి ప్రస్తుతం దాపురించిందన్నారు. అంటే రాష్ట్రం పరిస్థితులను ఏవిధంగా అర్థం చేసుకోవాలి.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విషయంలో మీరు ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు వాస్తవాలు చెప్పారో, లేదోనని సందేహంగా ఉంది. దయచేసి నిజాలను దాచి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో రాజకీయాలకు తావులేకుండా కలిసి కట్టుగా కోవిడ్‌పై పోరాటం చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడాలని' లేఖలో పేర్కొన్నారు.




Tags:    

Similar News