Raghunandan Rao: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. వారిపై రఘునందన్ రావు ఫైర్
Raghunandan Rao: ఢిల్లీ పేలుళ్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Raghunandan Rao: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. వారిపై రఘునందన్ రావు ఫైర్
Raghunandan Rao: ఢిల్లీ పేలుళ్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని.. సంగారెడ్డిలో నిర్వహించిన సర్దార్ ఏక్తా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. బాంబు పేలుళ్ల వెనుక బీజేపీ ఉందంటూ.. సోషల్‌మీడియాలో వస్తోన్న పోస్టుల్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు వస్తే బ్లాస్టులు జరుగుతున్నాయంటూ.. కొందరు నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఎవరూ సమర్థించవద్దని కోరారు.