Raghunandan Rao: నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను.. నాకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వండి..
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్స్
Raghunandan Rao: నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను.. నాకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వండి..
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదొక పదవి ఇవ్వాలని కోరారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఏదొకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చన్న రఘునందన్... రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. రెండోసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రఘునందన్. ఇక.. దుబ్బాకకు అమిత్‌షా వచ్చి ప్రచారం చేయలేదని, తనకు దుబ్బాక ఎన్నికల్లో ఎవరూ సాయం చేయలేదని రఘునందన్ అన్నారు.