Eleti Maheswar Reddy: రేవంత్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో.. రాజీనామా చేయించి బై ఎలక్షన్స్‌కు రావాలి

Eleti Maheswar Reddy: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.

Update: 2025-11-19 08:09 GMT

Eleti Maheswar Reddy: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్‌కు రావాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైరయ్యారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News