Dubbaka election: దుబ్బాక ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు : మంత్రి హరీష్ రావు!

Minister Harish Rao press conference: బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి.సంజయ్ కి మంత్రి హరీష్ రావు 9 పేజీల బహిరంగ లేఖ రాశారు.

Update: 2020-11-01 06:42 GMT

T Harish Rao (file Image)

Dubbaka Election  | దుబ్బాక ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీ పార్టీ కి లేదు : మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం..

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

* రాష్ట్ర ప్రజల తరపున బండి సంజయ్ కు నా 18 ప్రశ్నలు

* నా ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానాలు చెప్పాలి..

బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి.సంజయ్ కి మంత్రి హరీష్ రావు 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. దానిలో 18 ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానాలు చెప్పాలని కోరారు. ఈ బహిరంగ లేఖను మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏమన్నారంటే..

- నా లేఖకు బండి సంజయ్ స్పందిస్తారని ఆశిస్తున్నా

- ప్రజాస్వామ్యంలో ఓటగే హక్కు ఎవరికైనా ఉంటుంది

- దుబ్బాకలో బిజేపి నైతిక విలువలు మంట కలిపింది

- తెలంగాణను కేంద్రం అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది

- రాష్ట్ర హితం కోసం..లేఖ రాస్తున్న.. సూటిగా సమాధానం ఇస్తారని ఆశిస్తున్న

- ఫించన్లపై సవాల్ చేస్తే సమాధానం లేదు.. వ్యక్తి గత దాడులు...దూషణలకు దిగుతున్నారు.

- నా 18 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుంటే మీ బాధ్యత నుంచి తప్పుకున్నట్లే

- ఏడు మండలాలు,లోయర్ సీలేర్ ప్రాజెక్టును ఏపికి అప్పగించింది మీరు కాదా?

- బయ్యారం ఉక్కు ఫ్యార్టీ స్థాపించకుండా యువత పొట్ట కొడుతోంది మీరే కదా?

- కాజిపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసింది బిజెపి కాదా?

- నీటి వాటాలు లెక్క తేల్చకుండా...తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది నిజం కాదా?

- రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది బీజేపీ కాదా?

- పోలవరంకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చినట్లు ...తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?

- మిషన్ భగీరథ,మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పడం నిజం కాదా?

- మీకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఆ నిధులు కేంద్రం నుంచి ఇప్పించాగలరా?

- జాతీయ రహదారులకు వెంటనే నిధులు మంజూరు చేయించాగలరా? అది మీకు చేతనవుతుందా?

- 39 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఫించన్ల ఇస్తుంటే...కేంద్రం 6లక్షల మందికే ఇస్తోంది. కాదని నిరూపించగలరా?

- వరంగల్ కు ఎయిర్ పోర్ట్,టెస్ట్ టైల్ పార్క్ కు నిధులు మంజూరు చేయించాలి..బిజెపికి చిత్తశుద్ధి ఉందా?

- గిరిజనులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ను 6 నుంచి 10% పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే....కేంద్రం పక్కన పెట్టింది నిజమేనా కాదా?

- గంగా,నర్మదా నదిని ప్రక్షాళన చేసినట్లు మూసీని చేయిస్తారా?

- తెలంగాణకు కేంద్రం నుంచి చట్ట బద్దంగా రావాల్సిన 12వేల కోట్లు బకాయిలు ఇప్పించండి

నేను చెప్పిన 18 సమస్యలపై స్పందించి బండి.సంజయ్ చిత్త శుద్ధి చాటుకోవాలి అని హరీష్ రావు అన్నారు. అంతేకాకుండా అడుగడుగునా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 

Tags:    

Similar News