BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్.. తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల సభలు

BJP: అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత తెలంగాణకు ప్రధాని

Update: 2024-01-08 08:03 GMT

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్.. తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల సభలు

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ప్రధాని మోడీ... తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల సభలు నిర్వహించనున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో మోడీ సభలు ఉండనున్నాయి.ఇక నేతల మధ్య గ్యాప్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. వారిని సమన్వయం చేసే బాధ్యతను కిషన్‌రెడ్డికి అప్పగించారు అమిత్ షా.

పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. 35 శాతం ఓట్ షేర్‌తో పాటు.. పార్లమెంట్‌ స్థానాలు గెలుపే టార్గెట్‌గా ప్రణాళికలు రచిస్తుంది కమలం పార్టీ. సంస్థాగతంగా పార్టీలో మార్పులు- చేర్పులపై నజర్ పెట్టిన కాషాయదళం.. సంక్రాంతి తర్వాత కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని భావిస్తు్న్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News