Bandi Sanjay: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న విధ్వంసం ఇది
Bandi Sanjay: టీఆర్‌ఎస్ సహకారంతోనే నిన్నటి, ఇవాళ్టి ఘటనలు
Bandi Sanjay: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న విధ్వంసం ఇది
Bandi Sanjay: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై స్పందించిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోందని విమర్శించారు. విధ్వంసాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిపోషిస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న విధ్వంసం అని దుయ్యబట్టారు. ఆర్మీ విద్యార్థులకు ఈ విధ్వంసంతో సంబంధం లేదన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ సమావేశాల జరుగుతున్నాయని.. వాటిని దృష్టి మరల్చేందుకే ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.