Kishan Reddy: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం
Kishan Reddy: బీజేపీలో చేరిన నిర్మల్, మంథని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
Kishan Reddy: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం
Kishan Reddy: బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని బీసీ కుల సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిర్మల్, మంథని నియోజవకర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.