Maheshwar Reddy: అత్యాచారానికి గురైన గిరిజన మహిళను పరామర్శించిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
Maheshwar Reddy: కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామన్న మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy
Maheshwar Reddy: అత్యాచారానికి గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆసీఫాబాద్ జిల్లాకు చెందిన గిరిజన మహిళను బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లతో మాట్లాడి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులను కోరారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండాపోయిందని.. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. వరుసగా ఆదివాసీలపై అత్యాచార ఘటనలు జరగడం సర్కార్ నిర్లక్ష్యమే కారణమని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ బీజేపీ అండగా ఉంటుందని.. హామీ ఇచ్చారు.