సిరిసిల్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు..

Sircilla: సిరిసిల్ల జిల్లా చందుర్తి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది.

Update: 2022-12-20 10:06 GMT

సిరిసిల్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు..

Sircilla: సిరిసిల్ల జిల్లా చందుర్తి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. యువతి శాలిని తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్న శాలిని..వీరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు తెలిపింది. తన ప్రియుడుతో కలిసి పెళ్లి చేసుకున్నట్లు వీడియో పంపింది. ''నాలుగేళ్లుగా జానీని ప్రేమిస్తున్నాను. నా కోరిక మేరకే జానీ నన్ను తీసుకెళ్లాడు. జానీని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నాను. మా తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారు. వచ్చి తీసుకెళ్లమని జానీకి నేనే ఫోన్ చేసి చెప్పాను. తీసుకెళ్లేముందు మాస్క్‌ ఉండడంతో జానీని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి వివాహం చేసుకున్నాను'' అని వీడియోలో పేర్కొంది.

Tags:    

Similar News