Wine Shops: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌.. ఈనెల 14న వైన్‌ షాపులు బంద్‌..

Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌ ఈనెల 14న వైన్‌ షాపులు బంద్‌ ఉండనున్నాయి. హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌ ఉంటాయి. అయితే, ఏ ప్రాంతాల్లో వైన్‌ షాపులు బంద్‌ ఉంటాయి తెలుసుకుందాం.

Update: 2025-03-13 00:19 GMT

Wine Shops: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌.. ఈనెల 14న వైన్‌ షాపులు బంద్‌..

Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌ ఈనెల 14న వైన్‌ షాపులు బంద్‌ ఉండనున్నాయి. హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌ ఉంటాయి. అయితే, ఏ ప్రాంతాల్లో వైన్‌ షాపులు బంద్‌ ఉంటాయి తెలుసుకుందాం.Wine Shops Closed: హోలీ పండుగ సందర్భంగా ఈనెల 14న వైన్ షాపులు బంద్‌ ఉండనున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు బంద్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో వ్యాప్తంగా వైన్‌ షాప్స్‌ బంద్‌ ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్‌ శాఖ వెల్లడించింది.

అంతేకాదు హోలీ పండుగ సందర్భంగా మద్యం సేవించి బహిరంగా ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు చేస్తే కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు రంగులు కూడా మధ్యాహ్నంలోపు చల్లుకోవాలని, రోడ్లపై వెళ్లే ఇతర వ్యక్తులపై రంగులో చల్లకూడదని చెప్పారు. అంతేకాదు ర్యాలీ కూడా నిర్వహించకూడదని పోలీస్‌ శాఖ ఆదేశించింది.

హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి కూడా సెలవు ఉండనుంది. రేపు హోలికా దహనం, ఎల్లుండి హోలీ పండు, ఆ మరుసటి రోజు మార్చి 15న శనివారం మినహాయింది ఆ తర్వాత ఆదివారం రానుంది. ఇక బ్యాంకులు కూడా ఈరోజుల్లో బంద్‌ ఉంటాయి. మార్చి 13 హోలికా దహనం నిర్వహిస్తున్నారు. ఈసారి హోలీ రోజు చంద్ర గ్రహణం కూడా రానుంది. ఒకే నెలలో రెండు గ్రహణాలు రానున్నాయి. మార్చి 29న అమావాస్య రానుంది. సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది. హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు భంగ్‌ తాగే సంప్రదాయం కూడా ఉంది.

ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో ఇలా వైన్‌ షాపులు బంద్‌ చేస్తారు. ఏవైనా గొడవలు జరగకుండా ఉండటానికి ఇలాంటి భద్రత చర్యలు తీసుకుంటారు. అందుకే వైన్‌ షాపులు బంద్‌ చేస్తారు. ఎన్నికలు, ఏవైనా పండుగ రోజుల్లో కూడా వైన్‌ షాపులు బంద్‌ చేస్తారు. ఈరోజుల్లో వరుసగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి. అయితే, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ముందుగానే తెలుసుకుని బ్యాంకు లావాదేవీలు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Tags:    

Similar News