TSLPRB Constable: తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి
TSLPRB Constable: నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
TSLPRB Constable: తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి
TSLPRB Constable: కానిస్టేబుల్ నియామకం పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీంతో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు మార్గం సుగమమయ్యింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పనిచ్చింది. ఆ తీర్పును సెలక్టయిన కానిస్టేబుల్ అభ్యర్థులు సవాలు చేశారు. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్సపర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.