School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..రెండు రోజులు పాటు సెలవులు..ప్రభుత్వ ప్రకటన

School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్. రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోవాలి.

Update: 2025-02-20 00:33 GMT

School Holidays

School Holidays


విద్యార్థులకు బిగ్ అలర్ట్. రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోవాలి. మరి రెండు రోజులు పాటు సెలవులు ఎందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం.

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో పాఠశాలలు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అవి ఫిబ్రవరి 26,27తేదీలు. ఈ రెండు రోజులు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో మొదటి రోజు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వచ్చింది. 144ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి మహాశివరాత్రి కూడా ప్రత్యేకమైందిగా చెబుతున్నారు.

ఫిబ్రవరి 27వ తేదీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఆ రోజు పోలింగ్ ఉంది. అందువల్ల టీచర్లు, ప్రత్యేక విధుల్లో ఉంటారు. కాబట్టి ఆరోజు వారికి అదనపు భారం పడకుండా ఉండేందుకు విద్యార్ధులకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఇందులొక ట్విస్ట్ ఉంది. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఎంపిక చేసిన జిల్లాల్లో మాత్రమే ఉంటాయి. అవి కరీంనగర్, వరంగల్ మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో జరుగుతాయి. అందువల్ల ఫిబ్రవరి 27న ఈ జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు మాత్రమే ప్రభుత్వ సెలవు ఉంది. మిగతా జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలు తెరిచే ఉంటాయి.

సెలవుల ప్రకటన ఇలా ఉండగా..తల్లిదండ్రుల ప్లాన్ మరోలా ఉంది. ఫిబ్రవరి 26,27 తేదీల్లో రెండు రోజుల సెలవులను ఉపయోగించుకుని 28, మార్చి 1 తేదీల్లో కూడా సెలవులు తీసుకుంటే ఐదు రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలా నెలాఖరులో సెలవులు రావడం విద్యార్ధులకు ఉపశమనంలా అవుతోంది. 

Tags:    

Similar News