కాంగ్రెస్ తిరంగ ర్యాలీ ఉద్రిక్తం

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నిప్పులు చెరిగారు భట్టి విక్రమార్క

Update: 2019-12-28 16:16 GMT
Batti vikramarka

కాంగ్రెస్ తిరంగ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.. ర్యాలీకి అనుమతివ్వక పోవడంపై నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సత్యాగ్రహ దీక్షలో సీపీ అంజనీకుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. సీపీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్, ఆర్‌ఎస్ఎస్ తొత్తుగా అంజనీకుమార్ వ్యవహరిస్తున్నాడన్నారు. అంజనీకుమార్‌పై సోమవారం గవర్నర్‌ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఉత్తమ్. సెక్షన్‌- 8 ప్రకారం గవర్నర్‌కు చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన కాంగ్రెస్ తిరంగ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమైన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు, కార్యకర్తలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క , ఇతర నేతలు పాల్గొన్నారు. ర్యాలీకి అనుమతివ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. కేంద్రం సీఏఏ, ఎన్.ఆర్‌.సి లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నిప్పులు చెరిగారు భట్టి విక్రమార్క. సామ్రాజ్య వాద శక్తుల కంటే దారుణంగా కేసీఆర్‌ పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పతనమైయ్యే వరకూ కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. గాంధీని చంపిన వారి పాలన కేంద్రంలో కొనసాగుతుందని విమర్శించారు. బీజేపీ పాలనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని ఆరోపించారు. 

   

Tags:    

Similar News