భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి ముఠా గుట్టురట్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి ముఠా గుట్టురట్టు కారు ఇంజన్‌లో గంజాయి రవాణా చేస్తుండగా, ఇంజన్ వేడికి చెలరేగిన మంటలు కారును వాటర్ సర్వీసింగ్ సెంటర్‌కు తరలించిన స్మగ్లర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి ముఠా గుట్టురట్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. కారు ఇంజన్‌లో గంజాయి రవాణా చేస్తుండగా.. ఇంజన్ వేడికి మంటలు అంటుకున్నాయి. దీంతో స్మగ్లర్లు కారును వాటర్ సర్వీసింగ్ సెంటర్‌కు తరలించారు. మంటలు అదుపు చేసే క్రమంలో బ్యానట్ ఓపెన్ చేయగా.. కాలుతున్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఖంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు స్మగ్లర్లు పరారయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.