Minister KTR: భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదు..
KTR: GHMC అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
KTR: భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉండాలి.. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదని ఆదేశం
KTR: ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాలు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రి కేటీఆర్ GHMC ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో GHMC కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంత్రి కేటీఆర్. భారీ వర్షాలు కురిసినా పరిస్థితి ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదని ఆదేశించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలన్నారు.