Basti dawakhana in Telangana: మరో 33 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సన్నాహాలు

Basti dawakhana in Telangana: పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ప్రత్యేక దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది.

Update: 2020-07-06 02:45 GMT
Basti Dawakhana in Telangana

Basti dawakhana in Telangana: పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ప్రత్యేక దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్తే జీహెచ్ ఎంసీలోనే అత్యధికంగా కేసులు నమోదు కావడంతో ప్రధానంగా దీనిపై దృష్టి సారించారు. ఇక్కడ తీవ్రంగా వస్తున్న కేసులను బట్టి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. వీటి వల్ల ఎక్కడికక్కడే రోగులకు వైద్య సేవలందించి, కరోనా నుంచి దూరం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది.

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నగరంలో ఉన్నపేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కొత్తగా మరో 33 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసి ద్వారా వీటికి వసతి, ఇతర మౌలిక వసతులు కల్పించినట్టు ప్రకటించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించి ప్రాధమిక వైద్య సేవలను అందిస్తున్నట్టు తెలిపారు.

దీనిలో భాగంగా 2019లో ఏర్పాటుచేసిన 123 బస్తీదవాఖానాలకు అదంగా 2020 మేనెల 22న మరో 44 బస్తీదవాఖానాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసి పరిధిలో ప్రతి వార్డుకు కనీసం రెండుచొప్పున బస్తీదవాఖానాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా మరో 33 బస్తీదవాఖానాలను ప్రారంభించేందుకు అనువుగా వసతులు కల్పించినట్టు కమిషనర్‌ తెలిపారు. దీంతో నగరంలో బస్తీదవాఖానాల సంఖ్య 200లకు చేరుతుందని తెలిపారు. 

Tags:    

Similar News