Basara Floods: బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ
Basara Floods: బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. క్షణ క్షణం పెరుగుతున్న వరద ఉధృతితో పుష్కర ఘాట్లు, వేద హారతి శివలింగాలు నీటమునిగాయి.
Basara Floods: బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. క్షణ క్షణం పెరుగుతున్న వరద ఉధృతితో పుష్కర ఘాట్లు, వేద హారతి శివలింగాలు నీటమునిగాయి. దీంతో పోలీసులు పుణ్య స్నానాలు నిషేధించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పరివాహక ప్రాంతం వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి.. గోదావరి వెళ్ళే ప్రధాన రహదారి పైకి నీళ్ళు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు, పశువులకాపరులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.