Bandi Sanjay: వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. నేటి నుంచి మంచిర్యాలలో హాల్టింగ్..
Bandi Sanjay: తెలంగాణకు త్వరలో మరో రెండు వందే భారత్ రైళ్లు రానున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు.
Bandi Sanjay: వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. నేటి నుంచి మంచిర్యాలలో హాల్టింగ్..
Bandi Sanjay: తెలంగాణకు త్వరలో మరో రెండు వందే భారత్ రైళ్లు రానున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలు హాల్టింగ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న పదేళ్లలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
గత పదేళ్లలో తెలంగాణలో రైల్వేల కోసం రూ. 42 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని బండి సంజయ్ చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది ప్రజలు వందే భారత్ రైళ్లలో ప్రయాణించారని పేర్కొన్నారు. అలాగే, కేంద్రం అమలు చేస్తున్న ‘అమృత్ భారత్’ పథకం వల్ల రైల్వే స్టేషన్లు మినీ ఎయిర్‌పోర్టుల మాదిరిగా రూపుదిద్దుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని తెలిపారు.