Bandi Sanjay: ఎన్నికల కమిషన్‌పై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: టీఆర్ఎస్‌కి అభ్యర్థులు లేకనే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay (file image)
టీఆర్ఎస్‌కి అభ్యర్థులు లేకనే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎంకు మేయర్ పదవి ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అసత్య ప్రచారాలు ప్రజలు గుర్తించి దుబ్బాకలో ఓడించారని విమర్శించారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఇక అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ కొమ్ముకాస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.