Bandi Sanjay: రేపు కరీంనగర్‌లో బండి సంజయ్ దీక్ష
Bandi Sanjay: 119 నియోజకవర్గాల్లో ఒకేసారి బైక్ ర్యాలీలకు ప్లాన్
Bandi Sanjay: రేపు కరీంనగర్‌లో బండి సంజయ్ దీక్ష
Bandi Sanjay: టీబీజేపీ కార్యాలయంలో ఆపార్టీ కోర్ కమిటీ, చేరికల కమిటీ సమావేశాలు ముగిశాయి. పోడు భూముల సమస్య, ధరణి పోర్టల్‌పై బండి సంజయ్ సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా రేపు కరీంనగర్ లో బండి సంజయ్ దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు 119 నియోజకవర్గాల్లో ఒకేసారి బైక్ ర్యాలీకి బీజేపీ ప్లాన్ చేసింది.
ప్రజల ఘోష - బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేపట్టనుంది. పార్టీకి సరైన అభ్యర్థులు అని అనుకున్నవారిని జాయిన్ చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించిన బండి సంజయ్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యే వరకు పేర్లను బయటపెట్టొద్దన్నారు.