Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు కలిసి పోటీ చేసినా.. రాబోయే ఎన్నికల్లో విజయం బీజేపీదే
Bandi Sanjay: సింగిల్ గానే బరిలో దిగి విజయం సాధిస్తాం
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు కలిసి పోటీ చేసినా.. రాబోయే ఎన్నికల్లో విజయం బీజేపీదే
Bandi Sanjay: తెలంగాణలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ములుగులో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీచేస్తాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు కలిసి పోటీ చేసినా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని బండిసంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పోత్తు పెట్టుకోదని, బీజేపీ సింహంలా సింగిల్‌గానే బరిలో దిగుతుందని, విజయం సాధించి తీరుతామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గెలిచేది బీజేపీయేనని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.