Bandi Sanjay: ఇది సీఎం కేసీఆర్ రాజకీయ కుట్ర..
Bandi Sanjay: ఈ స్టేజ్ షో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. బాధితులు వాళ్లే... ఫిర్యాదు చేసిందీ వాళ్లే
Bandi Sanjay: ఇది సీఎం కేసీఆర్ రాజకీయ కుట్ర..
Bandi Sanjay: పైసాకి ఉపయోగపడని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఢిల్లీకెళ్లిన సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి స్క్రీన్‌ప్లే, డరెక్షన్ చేసి, హైదరాబాద్ ఫామ్ హౌస్ అమలుచేద్దామని ట్రైచేశారని పేర్కొన్నారు. బాధితులు, నిందితులు అంతా టీఆర్ఎస్‌వాళ్లేనన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రామాతో సంబంధంలేదని యాదాద్రిలో ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, భార్యాపిల్లలతోసహా యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఢిల్లీ డెక్కన్ హోటల్, ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ సీసీ ఫుటేజీలను బయటపెట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.