Bandi Sanjay: మహిళా కమిషన్ ముందు హాజరైన బండి సంజయ్
Bandi Sanjay: కమిషన్‌కు వివరణ ఇస్తున్న బండి సంజయ్
Bandi Sanjay: మహిళా కమిషన్ ముందు హాజరైన బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు చేశారంటూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందగా.. కమిషన్ బండి సంజయ్‌కు నోటీసులిచ్చింది. దీంతో ఇవాళ కమిషన్ ముందు హాజరైన బండి సంజయ్.. వివరణ ఇస్తున్నారు.
మరోవైపు మహిళా కమిషన్ ఎదుట మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మహిళా సంఘాల నేతలు.. ఎమ్మెల్సీ కవితకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే తమ పవర్ చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.