KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన బండి సంజయ్
KTR Vs Bandi Sanjay: కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించడానికి సిద్ధమైన ప్రతిసవాల్
KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన బండి సంజయ్
KTR Vs Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పన్నుల రూపంలో కేంద్రానికి 3.60 లక్షల కోట్లు చెల్లిస్తే రాష్ట్రానికి కేవలం 1.68 లక్షల కోట్లు మాత్రమే తిరిగి చెల్లించిందన్నారు. తాను చెప్పిన దాంట్లో తప్పుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. నిజమైతే అమిత్ షా తెలంగాణకు వచ్చి ముక్కు భూమికి రాయాలన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దేనరకద్ర , నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. వెంకపల్లిలో రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్వీకరించారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులపై చర్చించేందుకు తాము రెడీ అంటూ ప్రతిసవాల్ విసిరారు. మరి దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.