ఆదిలాబాద్‌లో బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

Adilabad: సీఎం రేవంత్‌‌పై బాల్కసుమన్‌.. అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ శ్రేణుల ఆగ్రహం

Update: 2024-02-06 09:40 GMT

ఆదిలాబాద్‌లో బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

Adilabad: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకులు అసహనంతో మాట్లాడుతున్నారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్ ఆరోపించారు.

Tags:    

Similar News