Balka Suman: సహనం కోల్పోయిన బాల్క సుమన్.. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ..

Balka Suman: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూయించి ఊగిపోయారు మాజీ విప్ బాల్కసుమన్.

Update: 2024-02-05 11:47 GMT

Balka Suman: సహనం కోల్పోయిన బాల్క సుమన్.. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ..

Balka Suman: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూయించి ఊగిపోయారు మాజీ విప్ బాల్కసుమన్. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలే గాడని దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామన్నారు.

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి బాల్క సుమన్ మాట్లాడాలన్నారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారన్నారు. రైతు బంధు కోసం గ‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కంట్రాక్ట‌ర్ల‌ జేబుల్లోకి మళ్ళించారని బాల్క సుమన్ ఆరోపించారు.

Tags:    

Similar News