Mancherial: శిశువుల తారుమారు కేసు సుఖాంతం
Mancherial: మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు
Mancherial: శిశువుల తారుమారు కేసు సుఖాంతం
Mancherial: మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు కేసు సుఖాంతమైంది. డిసెంబర్ 27న ఇద్దరు శిశువులు జన్మించారు. అయితే మగబిడ్డ విషయంలో ఇరు కుంటుంబాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఆస్పత్రి సూపర్డెంట్ హరిచంద్ర రెడ్డి ఇద్దరు చిన్నారులను శిశు సంరక్షణ శాఖకు తరలించి DNA పరీక్షలకు నమూనా పంపించారు. 8 రోజుల అనంతరం DNA ఫలితాలు మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సమక్షంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. చెన్నూరు మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన మమతకు ఆడపిల్ల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పావనికి మగ బిడ్డ పుట్టినట్టుగా నిర్ధారణ అయ్యింది.