Viveka Murder Case: నేడు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ
Viveka Murder Case: మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనున్న తెలంగాణ హైకోర్టు
Viveka Murder Case: నేడు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ
YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే విచారణ పలుమార్లు వాయిదా పడింది. ఇవాళ విచారణ జరుగుతుండటంతో ప్రధానంగా అవినాష్ రెడ్డి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టులోనే వేసుకోవాలని సూచించడంతో ఇక్కడే దీనిపై నిర్ణయం వెలువడనుంది. నిన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను కూడా తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.