Hyderabad: కృష్ణానగర్ లో దారుణం.. వాచ్ మెన్ ను తోసేసిన డ్యాన్సర్లు..
Hyderabad: వాచ్‌మెన్‌ను 4వ అంతస్తు నుంచి తోసేసిన యువకులు
Hyderabad: కృష్ణానగర్ లో దారుణం.. వాచ్ మెన్ ను తోసేసిన డ్యాన్సర్లు..
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు మద్యం తాగి హల్‌చల్ చేశారు. యువకులను వాచ్‌మన్ వద్దని వారించడంతో గొడవకు దిగారు. ఈ క్రమంలో వాచ్‌మన్‌ను నాలుగో అంతస్తు నుంచి తోసేశారు. దీంతో వాచ్‌మన్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనగర్ కాలనీలోని కృష్ణానగర్ సమీపంలోని స్పైసీ రెస్టారెంట్ పైనున్న రాఘవ గెస్ట్‌హౌజ్‌లో గత రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు యాదయ్యగా తెలుస్తోంది. నిందితులు నలుగురు డ్యాన్సర్లు కాగా... చెన్నై నుంచి వచ్చినట్లు సమాచారం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.