రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం.. సెప్టిక్ ట్యాంక్ సంపులో పడి బాలుడి మృతి

Rangareddy: ఫంక్షన్ హాల్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన పేరెంట్స్

Update: 2023-08-31 02:45 GMT

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం.. సెప్టిక్ ట్యాంక్ సంపులో పడి బాలుడి మృతి

Rangareddy: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బంధువుల వివాహం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఏడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి ఏడేళ్ల చిన్నారి బాలుడు దుర్మరణం చెందాడు ఏడేళ్ల అభిజిత్ రెడ్డి. అప్పటివరకు తనతోటి చిన్నారులతో ఆడుకున్న శ్రీకాంత్ రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

దీంతో చిన్నారి కనిపించడం లేదంటూ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఫంక్షన్ హల్‌లోని డ్రైనేజీ సంపులో మృతదేహం గుర్తించారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా ఉస్మానియాకు తరలించడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందో‎ళనకు దిగారు. కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని ఎలా పంపిస్తారు అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News