Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో దారుణం..
Hyderabad: టీచర్‌పై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో దారుణం..
Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థినులపై పీఈటీ టీచర్ విష్ణు అసభ్య ప్రవర్తించాడు. విద్యార్థినికి ఫోన్ చేసి పీఈటీ ఇబ్బంది పెట్టాడు. టీచర్‌పై తల్లిదండ్రులకు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. స్కూల్‌లో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్ రూమ్‌ను తల్లిదండ్రులు ధ్వంసం చేశారు. స్కూల్‌లో ఉన్న ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి పీఈటీ పారిపోయాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. స్కూల్ వద్దకు విద్యార్థి సంఘాల నాయకులు చేరుకున్నారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.