Shiva Balakrishna: భారీగా బయటపడుతోన్న HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు
Shiva Balakrishna: బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో ఐటీ రిటన్స్
Shiva Balakrishna: భారీగా బయటపడుతోన్న HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు
Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. బినామీల పేరుతో శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులు కూడగట్టినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. నిన్న బాలకృష్ణకు సంబంధించిన 2 కోట్ల 70 లక్షల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. శివబాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్... మరదలు అరుణ పేరిట సౌందర్య బోటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెసెస్ అనే నకిలీ సంస్థలు సృష్టించాడు శివబాలకృష్ణ.
శివబాలకృష్ణ ఫేక్ ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి.. శివబాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. బాలకృష్ణ కూతురు పద్మావతి పేరిట హోమ్ ట్యూషన్స్ నడిపిస్తున్నట్టు చూపించి ఐటీ రిటన్స్ ఫైల్ చేశారు. దీంతో శివబాలకృష్ణ బినామీలను మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమైంది ఏసీబీ.