కేటీఆర్‌కు ఒవైసీ మద్దతు.. థాంక్స్ చెప్పిన మంత్రి...

ఫాంహౌజ్ అంశంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2020-06-07 02:10 GMT
Asaduddin Owaisi, KTR (File Photo)

ఫాంహౌజ్ అంశంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతంలో గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111ను ఉల్లంఘించారనే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు నోటీసులు జారీ చేసింది.

దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కాంగ్రెస్ నేత ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆ భూమి తనది కానే కాదని ఇంతకు ముందే స్పష్టత ఇచ్చానని మరోసారి కేటీఆర్ చెప్పారు. అయితే ఈ ట్వీట్‌పై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. కేటీఆర్‌కు ఆయన మద్దతు తెలిపారు.

" మేం మీతో ఉన్నాం కేటీఆర్ గారూ. మంచి పనులు మీరు కొనసాగిస్తూనే ఉండండి. ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తూనే ఉంటాయి. మీకు మేం మద్దతుగా ఉంటాం. మీరు మీ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించండి మంత్రి.'' అని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారూ. దీనికి స్పందించిన కేటీఆర్ అసదుద్దీన్‌కు ధన్యవాదాలు తెలిపారు.



Tags:    

Similar News