Asaduddin Owaisi: దమ్ముంటే నాపై పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్
Asaduddin Owaisi: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్న.. రాహుల్ వ్యాఖ్యలకు సవాల్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi: దమ్ముంటే నాపై పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్
Asaduddin Owaisi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్‌కు దమ్ముంటే తనపై హైదరాబాద్ నుంచి పోటీచేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్న వ్యాఖ్యలకు అసదుద్దీన్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం పూర్తి మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతుందని, ముస్లింలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని అసదుద్దీన్ అభ్యర్థించారు. కాంగ్రెస్ హయాంలోనే మత కల్లోలాలు జరిగాయన్న అసదుద్దీన్..పీవీ హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేశారని గుర్తు చేశారు.