సెలవులు అని వచ్చి దొంగతనాలు చేసి దొరికిపోయిన సైనికుడు..

Update: 2019-10-22 10:14 GMT

శత్రువుల నుండి దేశాన్నికాపాడే భాద్యతగల సైనికుడి పదవిలో ఉన్నాడు అతను...  కానీ సెలవలు అని అని చెప్పి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. చివరికి దొరికిపోయి జైల్లో ఉన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన షేక్‌ సోహెల్‌ అనే అతను 2015లో సైనుకుడిగా విధుల్లో చేరాడు. ఇక 2017లో వేములవాడలో ఓ చోరి కేసులో దొరికి జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఎప్పటిలాగే మళ్లీ ఉద్యోగంలో చేరాడు..

అయితే గత నెల సెప్టెంబరు 4న నెలరోజులు సెలవులు అని చెప్పి, తాళాలు వేసిన ఇంటికి కన్నం వేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని గురురాఘవేంద్ర కాలనీ, భిక్కనూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని జంగంపల్లిల్లో చోరీలకు పాల్పడ్డాడు. వీటిపై కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు..  దర్యాప్తు చేస్తుండగా మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌తండాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న సోహెల్‌ పోలీసులను చూసి పారిపోయాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు.

చోరి కేసుల్లో భాగంగా అతన్ని వారి స్టైల్ లో ప్రశ్నించగా మొత్తం విషయం బయటపెట్టేసి దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అతని దగ్గరి నుండి పోలిసులు మూడు తులాల బంగారు నెక్లెస్‌, అర తులం బంగారు ఉంగరం, 130 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.17వేల నగదు, ఎయిర్‌ పిస్టల్‌, కత్తి, అయిదు ఖాళీ కాట్రిడ్జ్‌లు, అయిదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News