Jawan Missing: తిమ్మక్‌పల్లిలో ఆర్మీ జవాన్ అదృశ్యం
Jawan Missing: రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ జవాన్ నవీన్
Representational Image
Jawan Missing: కామారెడ్డి జిల్లా తిమ్మక్‌పల్లిలో ఆర్మీ జవాన్ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జోధ్పూర్ లో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ గత నెల 4న సొంతూరికి వచ్చాడు. తిరిగి ఆగస్టు 29న జోధ్పూర్ వెళ్లేందుకు కొత్త బస్టాండ్ నుంచి బయలుదేరాడు. అప్పటి నుంచి నవీన్ ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుంది. కుటుంబసభ్యులు ఆర్మీ అధికారులకు ఫోన్ చేయగా నవీన్ డ్యూటీకి ఇంకా రాలేదని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీతో నవీన్ కుటుంబసభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.