AP Police Vs TS Police: సాగర్‌ కేంద్రంగా ఏపీ పోలీస్‌ వర్సెస్‌ తెలంగాణ పోలీస్‌

AP Police Vs TS Police: నిన్న ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల ఫిర్యాదు

Update: 2023-12-02 07:05 GMT

AP Police Vs TS Police: సాగర్‌ కేంద్రంగా ఏపీ పోలీస్‌ వర్సెస్‌ తెలంగాణ పోలీస్‌

AP Police Vs TS Police: నాగార్జునసాగర్‌ వివాదం ఇప్పుడు ఏపీ పోలీస్‌ వర్సెస్‌ తెలంగాణ పోలీస్‌గా మారింది. నిన్న ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదైంది. నాగార్జునసాగర్ విజయపురి పీఎస్ లో ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్ పేరును చేర్చారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు.

447, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు పెట్టే యోచనలో ఉన్నారు. తమ విధులకు ఆటంకం కల్పించారని ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు సాగర సమరం కాస్తా.. ఏపీ పోలీస్‌ వర్సెస్‌ తెలంగాణ పోలీస్‌గా మారింది. మరోవైపు.. సాగర్‌ డ్యామ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి CRPF బలగాలు. దీంతో.. ఇరురాష్ట్రాల పోలీసులు.. డ్యామ్‌ పరిసర ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు.

Tags:    

Similar News