అఖిలప్రియ ఇంటికి ఏపీ పోలీసులు..పక్కింటి నుంచి గోడ దూకి వచ్చారన్న అఖిలప్రియ

Update: 2019-10-22 08:17 GMT

ఓ క్రషర్‌ యజమానిని బెదిరించాడన్న ఆరోపణలపై మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని అఖిలప్రియ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. ఆళ్లగడ్డ నుంచి వచ్చిన పోలీసులు అఖిలప్రియ ఇంటికి రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ సమయంలో అఖిలప్రియకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సెర్చ్‌ వారెంట్‌ ఉందా..? ఉంటే చూపించాలని అఖిలప్రియ డిమాండ్‌ చేశారు. అయితే పక్కింటి నుంచి గోడ దూకి తన ఇంట్లోకి పోలీసులు వచ్చారని లోపల ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News