Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి శిరీష రాత్రి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి శిరీష రాత్రి తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం దావూరు గ్రామానికి చెందిన మృతురాలు శిరీష.. త్రిబుల్ ఐటీలో మొదటి సంవత్సరం పీయూసీ చదువుతోంది. ఆమె తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక ఒత్తిడితోనా...? మరే ఇతర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందనే అంశం తేలాల్సింది ఉంది. పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృతదేహం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. కాగా రాత్రికి రాత్రే పోస్టుమార్టం వైద్యులు నిర్వహించారు. అనంతరం శిరీష మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.