Hyderabad: మీర్ పేట మహిళ హత్య కేసులో సంచలన విషయాలు..ఒకరు కాదు ముగ్గురా?

Update: 2025-02-10 05:07 GMT

Hyderabad: మీర్ పేట మహిళ హత్య కేసులో సంచలన విషయాలు..ఒకరు కాదు ముగ్గురా? 

Hyderabad: మీర్ పేట మహిళ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు అనుమతితో 4రోజులపాటు నిందితుడిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా మూడు రోజు విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం. భార్య మాధవిని గురుమూర్తి ఒక్కడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో నిందితుడు గురుమూర్తితోపాటు మరో ముగ్గురి పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్ లను నిందితులుగా చూపారు. ప్రధాన నిందితుడిపై హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేశారు. మిగిలిన ముగ్గురిపై బీఎన్ఎస్ లోని 85సెక్షన్ ప్రయోగించారు. ఈ ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా గురుమూర్తిది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు. ఆయన అదే ఊరికి చెందిన మాధవిని 13సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. కంచన్ బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నారు. గురుమూర్తికి మరో మహిళతో వివాహేత సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపైనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News