Rain in Telangana: రెండు రోజుల్లో వర్షాలు

Rain in Telangana: మరో అల్పపీడం ఏర్పడి..అది బలహీనపడి తుపానుగా మారే అవకాశం వుందిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2021-05-20 02:05 GMT

Rain in Telangana:(File Image) 

Rain in Telangana: తౌక్తే తుపాను మరవక ముందే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని యాస్ తుపాను నామకరణం చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే అవకాశం వుందని, దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షపాతం పడే అవకాశలు వున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నెల 26న బెంగాల్‌, ఒడిసా మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ తర్వాత దాని ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లపై పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే తెలంగాణలో గురువారం ఆకాశం మేఘావృత్తమె ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొనగా.. గురువారం తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాలో ఆ ప్రభావం చూపించింది.

Tags:    

Similar News