Praneeth Rao: సంచలనం సృష్టిస్తున్న ప్రణీత్‌రావ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్

Praneeth Rao: ఎన్నికల ఫలితాల రోజు వాటన్నిటినీ ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు

Update: 2024-03-19 15:31 GMT

Praneeth Rao: సంచలనం సృష్టిస్తున్న ప్రణీత్‌రావ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్

Praneeth Rao: సంచలనం సృష్టిస్తున్న ప్రణీత్‌రావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ బయటపడింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్‌ను ప్రణీత్ రావు విన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే.. సాధారణంగా స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరోలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే ఆస్కారం ఉంటుంది. కానీ.. ప్రణీత్ రావు.. అనధికారికంగా.. కొన్ని సాఫ్ట్‌వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అలా కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇంటలిజెన్స్ బ్యూరోలని కొన్ని కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసి.. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విన్నట్టు పోలీసులు గుర్తించారు. విన్న ఆ కాల్ రికార్డింగ్స్‌ను సొంత హార్డ్‌డిస్కుల్లో.. పెన్‌డ్రైవుల్లో.. దాచుకున్న ప్రణీత్‌రావు.. ఎన్నికల ఫలితాల రోజే వాటన్నింటినీ ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.

Tags:    

Similar News