Road Accident: ఐఏఎస్ అధికారి వాణీ ప్రసాద్‌కు తప్పిన పెను ప్రమాదం..
Vani Prasad IAS: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Road Accident: ఐఏఎస్ అధికారి వాణీ ప్రసాద్‌కు తప్పిన పెను ప్రమాదం..
Vani Prasad IAS: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హైద్రాబాద్ నుంచి విజయవాడకు ఆమె వెళ్తున్న కారు సోమవారం ప్రమాదం జరిగింది. మరో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లింది.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బావి ఉంది. అయితే పొలాల మధ్యే కారు నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న కోదాడ ఆర్ డీ ఓ , పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాణీ ప్రసాద్ ను 108 అంబులెన్స్ లో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.