Telangana: భూపాలపల్లి జిల్లాలో మానవత్వం చాటుకున్న ఎన్నారై
Telangana: కోతుల కోసం నీటి తొట్టిలు ఏర్పాటు చేసిన తోట సురేష్ * వన్యప్రాణులు సంరక్షణకు అందరూ పాటుపడాలని సూచన
Representational Image
Telangana: అడవి ప్రాంతంలో కోతుల కోసం నీటి తొట్టిలు ఏర్పాటు చేసి ఓ వ్యక్తి మానవత్వాన్ని చాటుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామానికి చెందిన తోట సురేష్ గత 10 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల స్వంత గ్రామానికి వచ్చి అడవి ప్రాంతంలో కోతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తీరు చూసి చలించిపోయాడు.
భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వరకు సుమారు 55 కీలో మీటర్ల మేర ప్రధాన రహదారి ఇరువైపులా నీటి తొట్టిలను ఏర్పాటు చేశాడు. ఎవరై ప్రయాణికులు ఆ తొట్టిలో ఒక బాటిల్ నీరు పోయాలని సూచించారు. వన్యప్రాణులు సంరక్షణకు అందరూ పాటుపడాలని సురేష్ కోరాడు.