Amit Shah: తెలంగాణలో రెండోసారి అమిత్‌షా సభ రద్దు

Amit Shah: ఈ నెల 29న ఖమ్మంలో జరగాల్సిన బీజేపీ సభ రద్దు

Update: 2023-07-24 15:00 GMT

Amit Shah: తెలంగాణలో రెండోసారి అమిత్‌షా సభ రద్దు

Amit Shah: తెలంగాణలో అమిత్‌ షా సభ రెండోసారి రద్దయింది. ఈ నెల 29న ఖమ్మంలో జరగాల్సిన సభకు అమిత్‌షా రాలేకపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో షా సభను రద్దు చేస్తున్నట్టు టీబీజేపీ ప్రకటించింది. అయితే.. తెలంగాణలో షా టూర్‌ యథాతధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 29న తెలంగాణలో అమిత్‌ షా పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమంతో పాటు.. మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ కమలనాథులు.

గత నెల 15న ఖమ్మంలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. ఆ సభకు అమిత్‌ షా హాజరుకావాల్సి ఉంది. అయితే.. అప్పట్లో బిపర్‌జాయ్‌ తుఫాన్‌ కారణంగా షా పర్యటన రద్దయింది. ఇప్పుడు మరోసారి వర్షాల వల్ల ఖమ్మం రద్దు కావడంతో కమలం కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు.

Tags:    

Similar News