Amit Shah: శంషాబాద్‌లో ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం
Amit Shah: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షాకు స్వాగతం పలికిన రాష్ట్ర బీజేపీ నేతలు
Amit Shah: శంషాబాద్‌లో ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం
Amit Shah: కాసేపట్లో చేవెళ్లలో బీజేపీ నిర్వహిస్తోన్న పార్లమెంటరీ ప్రవాసి యోజన సభకు హాజరుకానున్నారు అమిత్ షా. ఇప్పటికే శంషాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో సభకు రానున్నారు. ఈ సభతో అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకోవడంతో.. ఆయన ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.
శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దాదాపు 15 నిమిషాలుగా ఈ సమావేశం కొనసాగుతుండగా.. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశం జరపాల్సి ఉండగా.. షెడ్యూల్‌లో మార్పులతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే శంషాబాద్‌లోనే బీజేపీ నేతలతో ఆయన సమావేశం అయినట్లు తెలుస్తోంది.